గడిచిన ఏడాదిలో సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ సమధికోత్సాహంతో బాధ్యతలు స్వీకరించబోతున్న సహకార్యవర్గ సభ్యులకు శుభాభినందనలు. అడిగినదే తడవుగా ఆర్థికసాయం అందించి కార్యక్రమనిర్వహణలో తోడ్పడుతున్న పోషకదాతలకు కృతజ్ఞతాభివందనాలు.
ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా అనామకంగా తెరవెనుక సేవలందిస్తున్న లెక్కకు మించిన స్వచ్ఛంద సేవకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జరుగుతున్న కార్యక్రమాలను ఆదరిస్తూ ఈ సంస్థలో భాగస్వాములైన మీ అందరికీ కైమోడ్పు.