మనలో చాలామంది పని ఒత్తిడి వల్ల, లేదా పిల్లల వ్యవహారాల వలన యాంత్రిక జీవనానికి అలవాటుపడి మన గురించి మనం ఆలోచించుకోవటానికి తగినంత సమయం కేటాయించలేక పోతున్నాము. అందువలన ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రతి రోజు కొంత సమయం కేటాయిస్తే పరిపూర్ణ ఆరోగ్యంతో కేవలం శారీరకంగానే కాకుండా, సామాజికంగా, మానసికంగా, వృత్తిపరంగా, అన్ని రకాలుగా హాయిగా జీవితంలోని ఆనందాన్ని మకరందాలని ఆస్వాదించగలుగుతాం.
పరిపూర్ణ ఆరోగ్యమన్నది వైద్యంతో ... మందులతో సాధించేది కాదు. ఇది ఆసాంతం మన జీవనశైలితో మన అలవాట్లతో మన ఆలోచనలతో భావోద్వేగాలతో ముడిపడి మన ఆరోగ్యానికి మనమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పే విభాగం.
ఈ లక్ష్య సాధనలో మన అడుగులు ఎటు కదలాలో ... మన ఆలోచనలు ఏ దిశగా సాగితే మంచిదో ... అందరం కలిసి మన ఆలోచనలను ఆచరణలో పెట్టుకోవటానికి ఈ "సుఖీభవ'' కార్యక్రమాన్ని రూపొందించటం జరిగినది.