దాదాపు 4 దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సంస్థకు 2024 వ సంవత్సరానికి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నందుకు చాల సంతోషంగా వుంది. ఈ మహత్తర అవకాశం తెలుగు భాషా ,సంస్కృతులకు, స్థానిక తెలుగు సమాజానికి సేవ చేసే గొప్ప సదవకాశంగా భావిస్తున్నాను..
ప్రవాస భారత తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు రాజధానిగా డాలస్ ఫోర్ట్ వర్త్ మహానగరం వెలుగొందుతోంది.ఈ నగరం లో తెలుగు వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతుంది.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) నూతన కార్యవర్గ సభ్యులకు, పాలక మండలి సభ్యులకు ఇదే నా సాదర స్వాగతం. మీ అందరి సంపూర్ణ సహకారంతో మరింత వైవిధ్యమైన, ఆకర్షనీయమైన మరియు అవసరమైన కార్యకలాపాలను రూపొందించుకొందాం. విస్తృతంగా సంస్థ ఆశయాలను, కార్యక్రమాలను స్థానిక తెలుగు సమాజంలోకి తీసుకొని వెళ్ళాలని నా ఆకాంక్ష. 2024 వ సంవత్సరంలో ఈ లక్ష్యాలను సాధించడానికి మీ అందరి భాగస్వామ్యంతో, సమిష్టిగా ముందుకు సాగుదాం. తెలుగు భాష, సాహిత్య, సంస్కృతి, సంప్రదాయాలను తరువాతి తరాలకు అందేవిధంగా చూడడం వివిధరంగాల నిపుణులతో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యక్రమాలు విజయవంతం కావడానికి సలహాలు స్వీకరించడం, సంస్థ సభ్యులతో పాటు, తెలుగు వారందరూ భాగస్వామ్యులై, సంస్థ నిర్వహణకు అవసరమైన ఆర్ధిక,హార్థిక సహాయ సహకారం, సలహాలు అందేలా చూడడం,కార్యక్రమాలను అందరి సహకారంతో అత్యుత్తమ స్థాయిలో అందించడం ఈ సంస్థ మరియు అధ్యక్షుడిగా నా భాద్యత. సంస్థకి ఎళ్ళవేళలా అండగా ఉంటున్న పోషకదాతలకు, సభ్యులకు, శ్రేయోభిలాషులకు, కార్యవర్గ సభ్యులకు, పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతాభివందనాలు. మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ..
మీ సేవే మాధవ సేవగా భావించే ...
సతీష్ బoడారు |